25 నుంచి మన పాలన- మీ సూచన
సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ హరికిరణ్, జేసీలు గౌతమి, సాయికాంత్
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మన పాలన- మీ సూచన కార్యక్రమం ఈ నెల 25 నుంచి30వ తేదీ వరకు ఉంటుందని, విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు.
శనివారం సాయంత్రం విజయవాడ నుంచి దృశ్యమాధ్యమంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, జేసీ గౌతమి, సాయికాంత్‌తో సమీక్ష చేపట్టారు. ఆమె మాట్లాడుతూ... 50 మందితో ప్రతి రోజు కార్యక్రమాలు నిర్వహించాలని, పాల్గొన్న వారంతా ముఖానికి మాస్కులు తప్పక ధరించాలన్నారు.
అనంతరం జిల్లాలో కరోనా కేసులు, డిశ్చార్జ్, క్వారంటైన్ కేంద్రాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ-2 శివారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ ఉమాసుందరి తదితర అధికారులు పాల్గొన్నారు

0 Response to "25 నుంచి మన పాలన- మీ సూచన"
Post a Comment