రాష్ట్రంలో నమోదైన మొత్తం 2407 పాజిటివ్ కేసులకు గాను 1639 మంది డిశ్చార్జ్
అమరావతి: ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య,
కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది.
రాష్ట్రంలో రోజురోజుకు కేసులు
పెరిగాయి. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్‌ని పరీక్షించగా 68 మంది కోవిడ్-19
పాజిటివ్‌గా తేలారు.
43 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్
అయ్యారు. కోవిడ్ వల్ల కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు.
రాష్ట్రంలో నమోదైన
మొత్తం 2407 పాజిటివ్ కేసులకు గాను 1639 మంది డిశ్చార్జ్ కాగా, 53 మంది
మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 715. అయితే గత రెండు
రోజుల నుంచి జిల్లాల వారీగా లెక్కలను అధికారులు విడుదల చేయడం లేదు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయంలో గోప్యత పాటిస్తున్నారు

0 Response to "రాష్ట్రంలో నమోదైన మొత్తం 2407 పాజిటివ్ కేసులకు గాను 1639 మంది డిశ్చార్జ్"
Post a Comment