ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు షెడ్యూల్ విడుదల


అమరావతి: ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు షెడ్యూల్ విడుదలైంది. ఫీజు చెల్లింపులకు సంబంధించిన రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.




అన్ని ‘సెట్స్‌’కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు సమర్పించే గడువును జూన్‌ 15 వరకు పొడిగించినట్లు మండలి కార్యదర్శి బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఎంసెట్‌రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.500 చెల్లించాలన్నారు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్‌ 30, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 9, రూ.5000 ఆలస్య రుసుంతో జూలై 17, రూ.10 వేల ఆలస్య రుసుంతో జూలై 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

ఈసెట్‌: ఫీజు రూ.550, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఐసెట్‌: రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.550, రూ.2000 ఆలస్య రుసుంతో జూన్‌ 30, రూ.5000తో జూలై 11, రూ.10 వేలతో జూలై 18.

పీజీఈసెట్‌: రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.1000, ఎస్సీ/ఎస్టీలు రూ.500... రూ.500 ఆలస్య రుసుంతో జూలై 5, రూ.1000తో జూలై 16, రూ.2000 ఆలస్య రుసుంతో జూలై 25 

ఎడ్‌సెట్‌: రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.600, ఎస్సీ/ఎస్టీలురూ.400, రూ.500 ఆలస్య రుసుంతో జూలై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

లాసెట్‌: రిజిస్ర్టేషన్‌ ఫీజు(లాసెట్‌) రూ.750, (పీజీఎల్‌సెట్‌) రూ.850 చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుంతో జూలై 7, రూ.1000 ఆలస్య రుసుం తో జూలై 16, రూ.2000తో జూలై 25 వరకు సమర్పించవచ్చు

పీఈసెట్‌: రిజిస్ర్టేషన్‌ ఫీజు(ఇతరులు) రూ.850, ఎస్సీ/ఎస్టీలు రూ.650 చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుంతో జూలై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు షెడ్యూల్ విడుదల"

Post a Comment