కోవిడ్–19పై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: కోవిడ్-19 పరీక్షల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలతో దేశంలో ప్రధమ స్థానంలో ఏపీ కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కోవిడ్–19పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,65,069 పరీక్షలు నిర్వహించామని, శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 8388 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్‌కు 3091 పరీక్షలు జరుగుతున్నాయని.. తమిళనాడులో 2799 పరీక్షలు, రాజస్థాన్‌లో 1942 పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని అన్నారు.
పాజిటివిటీ రేటులో కూడా దేశ సగటుతో పోల్చితే రాష్ట్రంలో
పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని దేశంలో 3.92 శాతం కాగా రాష్ట్రంలో 1.17
శాతంగా ఉందని సీఎం అన్నారు. మరణాల రేటు దేశంలో 3.3 శాతం కాగా రాష్ట్రంలో
2.28 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కన్నా డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోందని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 43 కేసులు నమోదైతే 45 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. శుక్రవారం నమోదైన కేసులలో 31 కేసులు పాత క్లస్టర్ల నుంచే వచ్చాయని తెలిపారు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన రైతులతో పాటు, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన వారి మీద దృష్టి పెట్టామని అన్నారు
0 Response to "కోవిడ్–19పై సీఎం జగన్ సమీక్ష"
Post a Comment