రాష్ట్రంలో నమోదైన మొత్తం 1525 పాజిటివ్
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల అప్‌డేట్‌ను ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసింది.
గతగత 24 గంటల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 5943 శాంపిల్స్‌ని పరీక్షించగా 62 మందికి కోవిడ్19 పాజిటివ్ ఉన్నట్టు తేలింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం 1525 పాజిటివ్ కేసులకుగాను 441 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం 1051 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 38 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపింది.
గుంటూరు 19, పశ్చిమ గోదావరి - 7, కృష్ణ - 7, అనంతపూర్ - 2, చిత్తూర్ - 2, నెల్లూరు నుంచి ఒక్కరు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 441కి చేరింది.
0 Response to "రాష్ట్రంలో నమోదైన మొత్తం 1525 పాజిటివ్"
Post a Comment