exceptions for lock down
25 రకాల నిత్యావసర, అత్యవసర పరిశ్రమలకు ఓకే
50 శాతం సిబ్బందితో ఐటీ కంపెనీలూ పని చేయొచ్చు
నిబంధనలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Lockడౌన్ నుంచి పలు పరిశ్రమలకు మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని పేర్కొంది. దీనిలో భాగంగా 25 రకాల నిత్యావసర, అత్యవసర వస్తువులు తయారుచేసే పరిశ్రమలు, సెజ్‌లు, ఎగుమతి ప్రోత్సాహక జోన్‌లలోని పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు, ప్రాజెక్టులు, భవనాల నిర్మాణం, 50శాతం సిబ్బందితో ఐటీ, ఈ-కామర్స్ సంస్థలు తదితరాలకు కార్యకలాపాలు తిరిగి చేపట్టేందుకు అనుమతిచ్చింది. అయితే రెడ్‌జోన్‌లో ఉన్న పరిశ్రమలు మాత్రం తెరిచేందుకు వీల్లేదు. అదేవిధంగా రెడ్‌జోన్‌లో ఉన్న కార్మికులు, ఉద్యోగులు పరిశ్రమల్లో పనిచేసేందుకు అనుమతి లేదు. మళ్లీ కార్యకలాపాలు తెరిచేందుకు అనుమతిచ్చిన పరిశ్రమలన్నీ ఆయా జిల్లాల్లో జిల్లా పరిశ్రమల సంఘం జనరల్ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. పరిశ్రమలు ఉత్ప త్తి సమయంలోనూ కరోనా నియంత్రణ కోసం పాటించాల్సిన నియమాలు పాటించాలి. ఈ నియమాలను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అనుమతించిన పరిశ్రమలు
ధాన్యం, పప్పుల మిల్లులు, పిండి మిల్లులు, పాలు-పాల ఉత్పత్తులు, వాటర్ ప్లాంటులు, ఫ్రూట్‌జ్యూస్, బిస్కట్లు, పంచదార లాంటి ఆహార వస్తువులు, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీ, మందుల తయారీ, లిక్విడ్‌సబ్బులు, డిటర్జెంట్లు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్స్, బ్లీచింగ్ పౌడర్, మాస్కులు, బాడీ సూట్‌లు, నేప్‌కిన్స్, డైపర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, శీతల గిడ్డంగులు, మిర్చి, పసుపు, ఉప్పు, సుగంధ ద్రవ్యాల్లాంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, బేకరీలు, ఐస్ ప్లాంటులు... చేపలు, కోళ్లు, పశువుల దాణా, అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి, వాల్‌మార్ట్, అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సంస్థల కార్యకలాపాలు... పోర్టులు, విమానాశ్రయాల వద్ద ఉన్న గిడ్డంగులు, రవాణా, కొవిడ్ కిట్ల తయారీ రంగ పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
మినహాయింపు దక్కే ఇతర రంగాలు
గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతి. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు 50శాతం ఉద్యోగులతో పనిచేయవచ్చు. డాటా, కాల్ సెంటర్లు ప్రభుత్వ అవసరాల కోసం పనిచేయొచ్చు. చమురుశుద్ధి రంగంలోని పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు. టీ, కాఫీ, రబ్బరు, జీడిమామిడి శుద్ధి పరిశ్రమలు 50శాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు. బొగ్గు, ఇతర ఖనిజాల మైనింగ్, ఇటుక బట్టీలు, ఎరువుల తయారీ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆహారశుద్ధి పరిశ్రమలు, చేపలు, రొయ్యలు తదితర మాంసాహార ఉత్పత్తుల రవాణా తదితరాలకు మినహాయింపుతో పాటు పలు ఇతర రంగాల పరిశ్రమలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులను, అదేవిధంగా వైద్యరంగానికి సంబంధించిన వ్యక్తులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మినహాయింపులు ఇచ్చారు
0 Response to " exceptions for lock down"
Post a Comment