కేంద్ర హోంమంత్రిత్వశాఖ అర్దరాత్రి ఉత్తర్వులు
నివాసప్రాంతాల్లోని కొన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి
న్యూఢిల్లీ : లాక్డౌన్ నుంచి కొన్ని దుకాణాలకు మినహాయింపునిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం అర్దరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ నివాస ప్రాంతాల్లోని కొన్ని దుకాణాలు తిరిగి తెరిచేందుకు అనుమతిని కేంద్రం మంజూరు చేసింది.
మున్సిపల్ నివాసప్రాంతాల్లో అక్కడక్కడా విడిగా ఉన్న దుకాణాలను 50 శాతం సిబ్బందితో అవసరమైన జాగ్రత్తలు తీసుకొని తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. మున్సిపల్ నివాస సముదాయాల్లో స్వతంత్ర దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని షాపుల విషయంలో సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ లు ధరిస్తూ 50 శాతం సిబ్బందితో తిరిగి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించవచ్చని కేంద్రం పేర్కొంది.
Collect from:ABN online news today
0 Response to "కేంద్ర హోంమంత్రిత్వశాఖ అర్దరాత్రి ఉత్తర్వులు"
Post a Comment