ఆన్‌లైన్‌ను అనివార్యం చేయడంపై ఉపాధ్యాయుల మండిపాటు

లక్నో: లాక్డౌన్ సమయంలో పాఠశాలల్లో ఆన్‌లైన్ విద్యను తప్పనిసరి చేయడంపై ఉపాధ్యాయులు యూపీ బోర్డుపై మండిపడుతున్నారు. 


ఆన్‌లైన్‌లో పిల్లలకు బోధించడం ప్రారంభించని ఉపాధ్యాయులపై క్యారెక్టర్ రిజిస్టర్‌లో నెగిటివ్ రిపోర్ట్ నమోదవుతుందని జిల్లా పాఠశాల అధికారి ఆర్‌ఎన్ విశ్వకర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

వాట్సాప్ గ్రూపుకు కనెక్ట్ చేయడం ద్వారా ఏప్రిల్ 20 నుండి 100 శాతం విద్యార్థులకు పాఠాలు బోధించాలని  ప్రిన్సిపాల్స్‌కు బోర్డు ఒక లేఖ రాసింది. అయితే పలువురు ఉపాద్యాయులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయుల దగ్గర మొబైల్ ఫోన్లు లేవని వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవడం తగదని అన్నారు. కాగా  ఏప్రిల్ 20 న ఆన్‌లైన్ బోధన ప్రారంభమైంది. మాధ్యమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు దీనివల్ల ప్రయోజనం పొందుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆన్‌లైన్‌ను అనివార్యం చేయడంపై ఉపాధ్యాయుల మండిపాటు"

Post a Comment