పాఠశాల ఉపాధ్యాయులకు పూర్తి జీతాలివ్వండి...పంజాబ్ విద్యాశాఖ మంత్రి ఆదేశం
చండీఘడ్ (పంజాబ్): లాక్‌డౌన్ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాఠశాలల యాజమాన్యాలకు సంచలన ఆదేశాలు జారీ చేశారు.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు పూర్తిగా జీతాలు చెల్లించాలని పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ ఇందర్ సింగ్లా ఆదేశాలు జారీ చేశారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో పాఠశాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు నడపాలని మంత్రి కోరారు.లాక్‌డౌన్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు డిమాండ్ చేయవద్దని మంత్రి సూచించారు.
విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, బస్సు రవాణ చార్జీలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని మంత్రి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు
0 Response to "పాఠశాల ఉపాధ్యాయులకు పూర్తి జీతాలివ్వండి...పంజాబ్ విద్యాశాఖ మంత్రి ఆదేశం"
Post a Comment