టీచర్లకు లాక్‌డౌన్‌ నైట్‌డ్యూటీ



టీచర్లకు లాక్‌డౌన్‌ నైట్‌డ్యూటీ
విశాఖపట్నం, ఏప్రిల్‌ 9 : విశాఖ నగరంలో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయులకు పగటిపూటతోపాటు రాత్రి కూడా ‘లాక్‌డౌన్‌’ డ్యూటీలు వేశారు.
వారిని పోలీసులకు తోడుగా బందోబస్తు విధులకు నియమించారు. ఉపాధ్యాయులు ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు విధులు నిర్వహించాలని ఇంతకుముందు ఆదేశించారు.
కాగా.. బుధవారం నుంచి వారు రాత్రిపూట కూడా విధులు నిర్వహించాలని పోలీస్‌ అధికారులు స్పష్టంచేశారు.
దీంతో నగరంలో పలుచోట్ల టీచర్లు బుధవారం రాత్రి డ్యూటీ చేశారు. అయితే  ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టీచర్లకు లాక్‌డౌన్‌ నైట్‌డ్యూటీ"

Post a Comment