అత్యవసర ప్రయాణాలు

 అత్యవసర ప్రయాణాలు*

★ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికోసం కోవిడ్‌-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ప్రకటన.

★ పాసులు కావాలనుకునేవారు..
1.పేరు, పూర్తి చిరునామా, 
2.ఆధార్‌ కార్డు వివరాలు,
3.ప్రయాణించే వాహనం నెంబర్‌,  ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత అధికారులు పాసులు జారీచేస్తారు.

★ ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కావాలనుకునే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి పైన ఇచ్చిన వివరాలతో ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్‌ చేయాలి. 

★ జిల్లా ఎస్పీల వాట్సాప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీలు పైన ఇవ్వడం జరిగింది... అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్‌ నెంబర్‌/మెయిల్‌ ఐడీకి పంపిస్తారు. 




★ జిల్లా ఎస్పీ వాట్సాప్‌ నెంబర్‌/మెయిల్‌ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్‌ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు.  ప్రయాణించేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అత్యవసర ప్రయాణాలు"

Post a Comment