మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత రెండో విడత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 3న ముగుస్తుంది. ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా, కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, మిగతాచోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలకు చాలావరకు మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని ఇదే అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేశారని తెలుస్తోంది. ‘ఇప్పటివరకు రెండు లాక్‌డౌన్‌లను ప్రకటించాం.

రెండూ వేర్వేరు తరహా నిబంధనలున్నవి. ఆ దిశగా ఆలోచించాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు’అని సీఎంలతో మోదీ పేర్కొన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్‌ నుంచి దశలవారీగా బయటకు వచ్చే వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా ప్రధాని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ వ్యూహాలను స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలే రూపొందించుకోవాలని మోదీ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్‌), కేసీఆర్‌(తెలంగాణ), కేజ్రీవాల్‌(ఢిల్లీ), ఉద్ధవ్‌ ఠాక్రే(మహారాష్ట్ర), పళనిస్వామి(తమిళనాడు), కన్రాడ్‌ సంగ్మా(మేఘాలయ), యోగి ఆదిత్యనాథ్‌(యూపీ) తదితరులు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌"