ఫోన్ సిగ్నల్ లేదా..? ‘ట్రాయ్’ చేయండిలా
అయితే, నెట్‌వర్క్ విషయంలో
ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా ఫిర్యాదు చేయడానికి ఓ మార్గం ఉందని మీకు
తెలుసా..? అదే ట్రాయ్ (టెలిఫోన్ అథారిటీ ఆఫ్ ఇండియా) వెబ్‌సైట్. ఈ
వెబ్‌సైట్ ద్వారా మీరు మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌పై ఫిర్యాదులు చేయవచ్చు
ముందుగా ట్రాయ్‌కు చెందిన టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పర్యవేక్షణ వ్యవస్థ (టీసీసీఎంసీ) అధికారిక వెబ్‌సైట్ www.tccms.gov.in
లోకి ప్రవేశించాలి. సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ
రాష్ట్రం, జిల్లా తదితర విషయాలు నమోదు చేయాలి. ఒకసారి వివరాలు ఎంపిక చేసిన
తర్వాత కస్టమర్ కేర్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలతో ఓ కొత్త
బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సంబంధిత అంశంపై సరైన వివరాలతో సర్వీస్
ప్రొవైడర్‌పై ఫిర్యాదు నోట్ చేయాలి. అప్పుడు మీ సర్వీస్ ప్రొవైడర్‌కు
సంబంధించిన ఫిర్యాదుల విభాగం తాలూక వివరాలు చూపిస్తుంది. అప్పటికీ సమస్యకు
పరిష్కారం దొరక్కపోతే నేరుగా అప్పీలేట్ అథారిటీని
సంప్రదించొచ్చు. ఫిర్యాదు చేసిన ఐడీ నోట్ చేసుకోవాలి. మీ సమస్యను మూడు
నుంచి ఏడు రోజుల్లోపు పరిష్కరిస్తారు
0 Response to " ఫోన్ సిగ్నల్ లేదా..? ‘ట్రాయ్’ చేయండిలా"
Post a Comment