16 నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యా కమిషనర్ చిత్రారామచంద్రన్ ప్రకటన చేశారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి పాఠశాలలు
0 Response to "16 నుంచి ఒంటిపూట బడులు"
Post a Comment