ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు: రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య511కు చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. మణిపూర్ లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కేరళలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

మిజోరం, మణిపూర్ మినహా రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. 30 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పదికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. రోడ్ల మీదికి వచ్చేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు




రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

మహారాష్ట్ర 106 మరణాలు 3
కర్ణాటక 37 మరణాలు 1
బీహార్ 2, మరణాలు 1
రాజస్థాన్ 33
పశ్చిమ బెంగాల్ 7 మరణాలు 1
ఉత్తరప్రదేశ్ 33
చత్తీస్ గడ్ 1
హర్యానా 26
హిమచల్ 3 మరణాలు 1
మధ్యప్రదేశ్ 7
ఒడిశా 2
తమిళనాడు 12
జమ్మూ కాశ్మీర్ 4
లడక్ 13
ఉత్తారఖండ్ 3
పంజాబ్ 29
తమిళనాడు 12
కేరళ 95
గుజరాత్ 29 మరణాలు 1
ఢిల్లీ 31 మరణాలు 1
ఆంధ్రప్రదేశ్ 7
తెలంగాణ 36

దేశంలో మొత్తం 548 జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా ల్లో పాక్షికంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ రాష్ట్రాల్లోని 80 జిల్లాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. గుజరాత్, బీహార్, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు: రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ"

Post a Comment