కరోనా ఎఫెక్ట్: పరీక్షలు లేకుండానే పైతరగతులకి
అహ్మదాబాద్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి.. భావితరాల భవిష్యత్తుపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారి పరీక్షలు వాయిదా పడుతున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక, తమ చదువుల పరిస్థితి ఏంటా అని స్టూడెంట్స్ కూడా భయపడుతున్నారు. ఈ భయాలను దూరం చేయడం కోసం గుజరాత్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9వ తరగతి, అలాగే 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రద్దు చేతున్నట్లు ప్రకటించింది
0 Response to "కరోనా ఎఫెక్ట్: పరీక్షలు లేకుండానే పైతరగతులకి"
Post a Comment