ఆర్థిక సంవత్సరం పొడిగింపు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
*🌺ఆర్థిక సంవత్సరం పొడిగింపు.. కేంద్రం మరో కీలక నిర్ణయం*
*🌺కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డెడ్‌లైన్‌ను జూన్ 30గా నిర్ణయించింది.*
*🌺జులై1తో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించి చట్టంలోనూ మార్పు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.*
*🌺సోమవారం (మార్చి 30) రాత్రి విడుదల చేసిన గెజిట్‌లో ఈ మేరకు పేర్కొంది.*
*🌺తాజా నిర్ణయంతో వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు ఉద్యోగులు, వేతన జీవులందరికీ ఊరట కలిగింది.*
0 Response to "ఆర్థిక సంవత్సరం పొడిగింపు.. కేంద్రం మరో కీలక నిర్ణయం"
Post a Comment