ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

సాక్షి, విజయవాడ‌:  ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయి. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


 ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 147 మందికి నెగిటివ్‌ వచ్చింది.




 గుంటూరు - 9, విశాఖ - 6, కృష్ణా - 5, తూ.గో - 4, అనంతపురం - 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు"

Post a Comment