డెబిట్‌ కార్డ్‌లపై కొత్త నిబంధనలు

విదేశాల్లో కొనుగోళ్లకు అనుమతి తప్పనిసరి 
ముంబయి : భారత్‌లోని డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులు ఇకపై విదేశాల్లో కొనుగోళ్లు చేయకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. అనుచితంగా కార్డులను వాడటం, బ్యాంకింగ్‌ మోసాలను అడ్డుకొనేందుకు అన్ని బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం మార్చి 16 నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కేవలం దేశంలోని ఎటిఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పిఒఎస్‌) టెర్మినల్స్‌లో మాత్రమే లావాదేవీలు చేసేందుకు వీలుంది. ఇకపై జారీ చేసే కొత్త కార్డులు, కాల పరిమితి ముగిసిన కార్డులను రెన్యువల్‌ చేసుకున్నప్పుడు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది


అయితే ఖాతాదారులు ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకుంటే బ్యాంకు నుంచి ముందే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలను రద్దు చేసే అధికారం బ్యాంకు లకు ఉంటుంది. ఇంతకు ముందు తీసుకున్న కార్డుల ద్వారా ఇప్పటి వరకు ఆన్‌లైన్‌, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలు చేయకపోయినా బ్యాంకులు ఆ సదుపాయా లను రద్దు చేస్తాయి. ఇకపై వినియోగదారులు తమ కార్డులను సంబంధిత ఎటిఎంల ద్వారా స్విచ్‌ ఆఫ్‌ లేదా ఆన్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తున్నాయి. దీంతో భారత కార్డ్‌లను విదేశాల్లో సైబర్‌ మోసగాళ్లు ఉపయోగించడానికి వీలు పడదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డెబిట్‌ కార్డ్‌లపై కొత్త నిబంధనలు"

Post a Comment