వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్‌.. ఇక సింపుల్‌గా డిలీట్ ఆప్షన్‌

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనస్సును దోచుకున్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, ఆప్షన్లతో దూసుకు పోతోంది. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వాడుతోన్న యూజర్ల సంఖ్య పెరిగిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫేస్‌బుక్ క్రేజ్‌ను సైతం వాట్సాప్ డామినేట్ చేసేలా ఉంది. ఇటీవలే డార్క్ మోడ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ ఇప్పుడు మరో సూపర్ ఫీచర్‌ను ఆవిష్కృతం చేసింది


ఇది డిలీట్‌కు సంబంధించిన సరికొత్త ఫీచర్‌. మనం అవతలి వ్యక్తులకు వాట్సాప్లో మెసేజ్ పంపితే ఆ మెసేజ్ డిలీట్ చేయాలంటే Delete For Everyone ఆప్షన్ ను ఉపయోగిస్తాం. ఈ టైంలో మనం మెసేజ్ డిలీట్ చేస్తే అక్కడ You deleted this message అనే మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది

ఇప్పుడు మారిన ఆప్షన్ నేపథ్యంలో మనం ఫీచర్ ద్వారా పంపిన మెసేజ్‌లు అన్ని ఆటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లు 2.20.83, 2.20.84ల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మెసేజ్ పంపిన తర్వాత గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరంలో మనం వీటిని డిలీట్ చేసే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

మనం పైన చెప్పుకున్న వాటిల్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటామో ? అప్పుడే ఇది డిలీట్ అవుతుంది. ఈ విషయాన్ని WABetaInfo వెల్లడించింది. ప్రస్తుతం ఇది ట్రైల్ వెర్షన్‌లో ఉంది. త్వరలోనే దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. వాట్సాప్ టీమ్ దీనిపై పనిచేయడం ఇప్పటికే ప్రారంభించింది. ఇక మరో సమాచారం ఏంటంటే ప్రస్తుతం ఈ ఆప్షన్ గ్రూపులకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని.. గ్రూప్ అడ్మిన్లు మాత్రమే దీనిని ఎనేబుల్ చేయగలరని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్‌.. ఇక సింపుల్‌గా డిలీట్ ఆప్షన్‌"

Post a Comment