“జగనన్న గోరు ముద్ద' యాప్ ఆవిష్కరణ
పాఠశాలల్లో ఏ రోజు ఏ మెనూ ఇచ్చేది స్పష్టీకరణ
సాక్షి అమరావతి: జగనన్న గోరు ముద్ద
యాప్‌ను విద్యా శాఖ కార్యదర్శి బి.రాజశేఖర్
గురువారం ఆవిష్కరించారు. అనంతరం
మధ్యాహ్న భోజన పథకంపై ఆయన
సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ంెడ్డి
మధ్యాహ్న భోజన పథకం మెనూను పూర్తిగా
మార్పు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ
మేరకు మార్పులు చేసి అమలు
చేస్తున్నామన్నారు. నూతన మెనూ కింద
పులిహోర, తీపి పొంగలి, వెజిటబుల్ రైస్,
కిచిడీ, చిక్కీ పొందుపరిచారని అన్నారు.
నూతన మెనూ నాణ్యత, పరిమాణం
కచ్చితంగా అమలు పరచేందుకు నాలుగు
అంచెల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
లోటుపాట్లు పరిశీలించేందుకు, సమస్యలు
వెంటనే తెలుసుకుని పరిష్కరించేందుకే
ఇ ఏ రోజు ఏ ఆహారం
ఇవా వలో యాప్‌లో ద
స్పష్టంగా ఉంటుంది.
అ ఎక్కడ ఎలాంటి
ఫిర్యాదు వచ్చినా
వెంటనే యాప్‌లో
నమోదు చేయాలి.
ఇ జిల్లా, మండల స్థాయి
అధికారులు ఈ
పథకాన్ని పర్యవేక్షిస్తూ
భోజన నాణ్యత,
పరిమాణంపై వారి
అభిప్రాయాలు
నమోదు చేయాలి.
ప్రత్యేకంగా “జగనన్న గోరు ముద్ద' యాప్‌ను ఆవిష్కరించామని చెప్పారు.
మధ్యాహ్న భోజన సంచాలకులు సీహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ వివిధ స్థాయిల్లోని
స్వయం సహాయక సంఘాలకు యాప్ వినియోగంపై శిక్షణా తరగతులు
నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయ సంక్షేమ-విద్య
సహాయకుల సేవలను మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో పారిశుద్ధ్య
కార్యక్రమం పర్యవేక్షణకు వినియోగించుకోవాలని గ్రామ సచివాలయ రాష్ట్ర
ప్రత్యేక కార్యదర్శి కె.కన్నబాబు సూచించారు.
0 Response to "“జగనన్న గోరు ముద్ద' యాప్ ఆవిష్కరణ"
Post a Comment