ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా

అమరావతి: కరోనా ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. కరోనా నివారణపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసింది. 6 వారాల పాటు ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. 


6 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవని ఆయన తెలిపారు. వలంటీర్లపై ఆరోణలు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రమేశ్ కుమార్ ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా"

Post a Comment