ఈ టీచర్ చెప్పినట్టు చేస్తే... కరోనా వైరస్ దగ్గరికి కూడా రాదు
ప్రాణాంతక వైరస్ కోవిడ్-19 శరవేగంగా విస్తరిస్తుండడంతో ఇప్పుడు ప్రపంచం
మొత్తం దాన్ని నిలువరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేకించి
చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవడం ముఖ్యమైన నివారణ చర్యల్లో ఒకటిగా
చెబుతున్నారు. అయితే దానివల్ల ఎంత ఉపయోగమో అనేదానిపై
అమెరికాకి చెందిన ఓ టీచర్ తన విద్యార్ధులకు కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఈ
ప్రయోగం తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ
వీడియోలో... మిర్యాల పొడి వేసిన నీటిలో చేతి వేళ్లను ముంచమని చెప్పిన
టీచర్.. తద్వారా చేతులకు ‘‘వైరస్’’ ఎలా అంటుతుందో చెప్పారు. తర్వాత సబ్బు
నీటితో శుభ్రం చేసుకోమని చెప్పి మళ్లీ అదే మిర్యాల పొడి ఉన్న నీటిలో
వేళ్లను ముంచమని చెప్పారు. అలా చేయగానే మిర్యాల పొడి వెనక్కి పోవడాన్ని
చూపించి వైరస్ ఎలా దూరమవుతుందో వివరించారామె!
0 Response to "ఈ టీచర్ చెప్పినట్టు చేస్తే... కరోనా వైరస్ దగ్గరికి కూడా రాదు"
Post a Comment