తగినంత నగదు ఉందేలా చూసుకోండి

తగినంత నగదు ఉందేలా చూసుకోండి..


 బ్యాంకులకు ప్రభుత్వం సూచన



న్యూఢిల్లీ: ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వేళ వేతన జీవులు ఇబ్బంది పడకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఒక్కసారిగా వితడ్రాయ ల్స్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉండటంతో తగి నంత స్థాయిలో నగదు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచిం చింది. అలాగే వివిధ పథకాల కింద రైతులు,


వృద్దులు, వితంతువులు, దివ్యాంగుల ఖాతాల్లోకి బదిలీ చేసే నగదును ఆయా వర్గాలు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని పేర్కొంది. కరోనావైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే రాబోయే రోజుల్లో వివిధ పథకాల లబ్ధిదారులు విత్‌ డ్రాయల్స్‌ కోసం పెద్ద ఎత్తున బ్యాంకులకు వచ్చే అవకాశం ఉందని సీనియర్‌ బ్యాంక్‌ అధికారి ఒకరు తెలిపారు.



దీంతో పాటు జీతాల విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఎప్రిల్‌ 1 నుంచి 10 దాకా బ్యాంకుల్లో రద్దీ ఉంటుందని ౫ జట వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే డిమాండ్‌కి తగి నంత సాయిలో శాఖలతో లా పాటు ఏటీఎంలలో కూడా నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆర్ధిక శాఖలో భాగ మైన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) సూచించి నట్లు సంపంథత వర్గాలు తెలిపాయి. అలాగే సాధ్య మైనంత ఎక్కువ సంఖ్యలో శాఖలను కూడా తెరిచి ఉంచాలని కూడా ఆదేశించినట్లు వివరించాయి. రామ్రాలకూ లేఖలు...: బ్యాంకుల సిబ్బంది, ఆర్‌ బీఐ ఉద్యోగులు,


నగదు సరఫరా చేసే సంస్థల సిబ్బంది, ఏటీఎం మెయింటెనెన్స్‌ ఉద్యోగులు, నగదు వ్యాన్లు మొదలైన వాటి రాకపోకలకు ఆటం కాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా డీఎఫ్‌వస్‌ త రాసింది. లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల కారణంగా వీరు ఇబ్బం దులు పడకుండా చూసేందుకు అధికారులు, పోలీ సులకు తగు సూచనలు చేయాలని పేరొంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తగినంత నగదు ఉందేలా చూసుకోండి"

Post a Comment