ఏపీలో 'నిఘా' మొబైల్ యాప్ ప్రారంభం
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తదితర అక్రమాలపై నిఘా పెట్టేందుకు ఉద్దేశించిన 'నిఘా' మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సీఎంవో కార్యదర్శి పీవీ రమేశ్‌లతో కలిసి ఈ యాప్‌ను అవిష్కరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిఘా పెట్టేందుకు ఈ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రభుత్వానికి ఫొటో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని.. దీనికి 'నిఘా యాప్' అనే పేరు పెట్టినట్టు సీఎం వివరించారు
0 Response to "ఏపీలో 'నిఘా' మొబైల్ యాప్ ప్రారంభం"
Post a Comment