వాడకపోతే.. మీ కార్డులు రద్దవుతాయి..!
దిల్లీ: మీ వద్ద ఉన్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డును అస్సలు ఉపయోగించలేదా? అయితే వెంటనే ఉపయోగించండి. లేదంటే మార్చి 16 నుంచి అవి పనిచేయడం మానేస్తాయి. ఈ విషయాన్ని ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ వెల్లడించింది. చాలా కాలంగా వినియోగంలో లేని క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగించి మార్చి 16 నుంచి ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు చేయడం కుదరదు. ఈ మేరకు కార్డుల జారీ సంస్థలకు కూడా సూచనలు చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అదేవిధంగా ఇచ్చిన గడువులోపు తమ కార్డులను వినియోగించుకోవాలని వినియోగదారులకు సూచించింది. డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రతను పటిష్ఠం చేయడం కోసమే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది
0 Response to "వాడకపోతే.. మీ కార్డులు రద్దవుతాయి..!"
Post a Comment