పదేళ్లు సస్పెండ్ అయిన ఉద్యోగికి మొత్తం వేతనం
కాకినాడ: మారేడుమిల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీనియర్
అసిస్టెంట్‌గా పని చేస్తూ పదేళ్లు సస్పెన్షన్‌కు గురై అనంతరం ఉద్యోగ విరమణ
చేసి పీఏ వరప్రసాద్‌కు కోర్టు తీర్పు మేరకు పదేళ్ల వేతనం చెల్లించేందుకు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1995లో ప్రభుత్వ నిధులు బ్యాంకు నుంచి
విత్‌డ్రా చేసి స్వాహా చేశారన్న అభియోగాలు రావడంతో 1997 నుంచి 1999 వరకు
రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం అభియోగాలు నిర్ధారణ
అయ్యాయనే కారణంగా 2004 నుంచి 2012 వరకు డిస్మిస్ చేశారు.
దీనిపై 2015లో
ఆయన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా ఈ అభియోగాలు నిరాధారమని తేలింది. తాను
ఆర్థికంగా నష్టపోయానని పదేళ్లు జీతం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు.
కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా రావడంతో పదేళ్లు జీతం ఇచ్చేందుకు ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది
0 Response to "పదేళ్లు సస్పెండ్ అయిన ఉద్యోగికి మొత్తం వేతనం"
Post a Comment