కరోనా వ్యాప్తిపై కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: రోజురోజుకు కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించి కొనుగోళ్లు, ఇతర నిర్ణయాలు 




తీసుకునేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఏపీలో 11 అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. దీంతో అధికారులు వారి నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనా వ్యాప్తిపై కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం"

Post a Comment