కరోనాపై టాస్క్‌ఫోర్స్‌

  • మంత్రులు, ఐఏఎస్‌లతో ఏర్పాటు


అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా విజృంభణను కట్టడి చేసేందుకు మంత్రులు, ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, ఆళ్ల నానితో సహా సీఎంఓ అధికారులు అజేయ కల్లాం, పీవీ రమేశ్‌, సాల్మన్‌ ఆరోకియారాజ్‌, ధనుంజయరెడ్డి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబు, మరో పదిమంది ఐఏఎస్‌ అధికారులతో కూడిన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్‌ శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో కూడిన టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రత్యేక కార్యాచరణతో సమష్టిగా కదలాల్సిన అవసరం ఉందంటూ ‘పద్ధతి లేని యుద్ధం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేశారు.



లాక్‌డౌన్‌ అమలుకు... 

రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు సీఎస్‌ నీలం సాహ్ని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది. ఇది ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలపై సూచనలు చేస్తుంది. దీనికి సీఎస్‌ చైర్మన్‌గా, ఆరోగ్యశాఖ ప్రతేక ప్రధాన కార్యదర్శి కోచైర్మన్‌గా వ్యవహరిస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనాపై టాస్క్‌ఫోర్స్‌"

Post a Comment