పరీక్షలు వర్సెస్‌ ఎన్నికలు

  • ఇంటర్‌-టెన్త్‌ ఎగ్జామ్స్‌పై ‘స్థానిక’ ప్రభావం?
  • షెడ్యూల్‌ ప్రకారమే జరుపుతామంటున్న ఇంటర్‌ బోర్డు
  • జాతీయ పరీక్షలతో లింకు ఉంటుందని స్పష్టీకరణ


అమరావతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వార్షిక పరీక్షల నిర్వహణకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. బుధవారం నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకూ ప్రభుత్వ పరీక్షల విభాగం సమాయత్తమైంది. పరీక్షా కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు, వేలాది మంది టీచర్లు, లెక్చరర్లు.. నెలకుపైగా సాగే ఈ క్రతువులో భాగస్వాములు కానున్నారు.


కానీ ఇదే సమయంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు సాగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అటు ఎన్నికలు, ఇటు పరీక్షలనూ సమన్వయం చేసుకుంటూ.. ప్రణాళికాబద్ధంగా వెళ్లాలన్న సీఎం ఆలోచన ఆచరణ సాధ్యమా అని పలువురు విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాల్సి రావచ్చన్న సందేహాలనూ వ్యక్తంచేస్తున్నారు. అయితే పరీక్షల వాయిదా కుదరదని.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. విద్యార్థులందరూ ఇప్పటికే హాల్‌ టికెట్లు తీసుకున్నారని ఇంటర్‌ బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్డ్స్‌ పరీక్షలు, నీట్‌ పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు చేశామని.. దానిని మార్చడానికి అవకాశమే లేదని అంటున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పరీక్షలు వర్సెస్‌ ఎన్నికలు"

Post a Comment