Aadhaar card: మీ పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోండి ఇలా
మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఇంకా తీసుకోలేదా? ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ ప్రతీ చోట అవసరం అవుతోంది. బ్యాంకు అకౌంట్ దగ్గర్నుంచి ప్రభుత్వ స్కీమ్‌ల వరకు చాలా చోట్ల ఆధార్ అవసరం. పెద్దలకే కాదు... పిల్లలు కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే. అందుకే పిల్లలకు కూడా ఆధార్ కార్డు తీసుకోవాలి. పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్ కార్డు తీసుకునేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI సేవలు అందిస్తోంది. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఆధార్ కార్డు తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
మీ పిల్లల వయస్సు ఐదేళ్ల లోపు అయితే తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల్ని తీసుకొని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. తల్లి లేదా తండ్రి తమ ఆధార్ కార్డును చూపించాలి
మీ పిల్లల వయస్సు 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటే ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌తో పాటు స్కూల్ ఐడీ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్ కాపీ జత చేయాలి. అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. పిల్లలకు స్కూల్ ఐడీ కార్డు లేకపోతే తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు కాపీ జత చేయాలి. ఇక మీ పిల్లల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత కొత్త ఆధార్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. పిల్లలకు ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ కొన్ని సేవల్ని ఉచితంగా అందిస్తోంది. వాటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇవి కుడా చదవండి
0 Response to "Aadhaar card: మీ పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోండి ఇలా"
Post a Comment