ఏపీలో తాజాగా 22 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ
అవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య
59కి పెరిగింది. మరోవైపు ఏపీలోనూ పాజిటివ్ కేసులు 13కి చేరాయి. శుక్రవారం
నాడు గుంటూరు, విశాఖలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అయితే.. తాజాగా ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పరీక్షించిన 22 శాంపిల్స్‌లో అన్నీ నెగిటివ్ వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ఇంతవరకూ కొత్తగా పాజిటివ్ కేసు నమెదు కాలేదు. ఇప్పటివరకూ నమోదైన 13 కేసుల్లో 10 విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే. మిగతా ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అని ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది
అమరావతి: కరోనా వ్యాప్తిపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజా బులెటిన్
విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 కరోనా పాజిటివ్ కేసులు
నమోదైనట్లు వెల్లడించింది. 22 కేసుల్లో నెగెటివ్ వచ్చిందని ప్రభుత్వం
ప్రకటించింది. ఇంకా 37 కేసులకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉందని
పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన 29,264 మందిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు
ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 149 మందికి వివిధ ఆస్పత్రుల్లో
చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. క్వారంటైన్ కోసం 23,479 బెడ్లు సిద్ధం
చేసినట్లు ప్రభుత్వం తెలిపింది
0 Response to "ఏపీలో తాజాగా 22 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా"
Post a Comment