16 నుండి ప్రారంభం కానున్న బ్రిడ్జ్ కోర్స్ నిర్వహణ పై పాటించాల్సిన ముఖ్య వివరాలు..
★ 1) బ్రిడ్జి కోర్సు లో భాగంగా బేస్లైన్ పరీక్షను ది 16.03.2020 న ఉదయం 10 గంటలకు జిల్లా లోని అన్ని ప్రాధమిక పాఠశాలలలో(except private primary schools) జరుగునట్లు మండల విద్యా శాఖాధికారులు సదరు ప్రధానోపాధ్యాయులకు ఆదేశించవలెను.
★ 2) బేస్లైన్ పరీక్ష అయిపోయిన వెను వెంటనే ఉపాధ్యాయులచే వాల్యూ చేయించి విద్యార్థులను స్థాయి1 మరియు స్థాయి 2 లు గా మండల లోని అన్ని పాఠశాలల వివరాలు consolidation చేసి మండల విద్యా శాఖాధికారులు DCEB కు వాట్స్అప్ నకు పంపడం లేదా కు మెయిల్ చేయవలెను.
★ 3)జిల్లా లోని ఉప విద్యా శాఖాధి కారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు అసెస్మెంట్ సెల్ మెంబర్స్ పాఠశాలల్లో జరుగు బ్రిడ్జి కోర్స్ అమలును పరిశీలించి లోపాలు ఉంటే వాటిని సరిచేయవలెను.
★ 4) ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులందరు ఈ బ్రిడ్జి కోర్స్ ను ఎటువంటి deviations లేకుండా అమలుపరచాలని జిల్లా విద్యా శాఖాధి కారిని గారు ఆదేశించారు.
★ 5)విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చిన ఇబ్భంది లేదు. విద్యార్థుల స్థాయి తెలుసుకొనుటకు మాత్రమే పరీక్ష నిర్వహించబడు తున్నది. కావున పరీక్షను ఎటువంటి Deviations లేకుండా నిర్వహించవలెనని జిల్లా విద్యా శాఖాధి కారిణి గారు ఆదేశించారు.
*
0 Response to "16 నుండి ప్రారంభం కానున్న బ్రిడ్జ్ కోర్స్ నిర్వహణ పై పాటించాల్సిన ముఖ్య వివరాలు.."
Post a Comment