త్వరలోనే పీఆర్సీ అమలు
- ఇప్పటికే సీఎం స్పష్టత ఇచ్చారు
- దీనికి గడువుతో సంబంధం లేదు
- శాసన మండలిలో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) గడువు పెంపునకు, పీఆర్సీ ప్రకటించడానికి సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరు అంశాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని చెప్పారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నర్సిరెడ్డి, రామచంద్రరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు
త్వరలోనే వర్సిటీల్లో పోస్టుల భర్తీ
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక మొత్తం 1,50,260 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని, వీటిలో 1,32,889 పోస్టులకునోటిఫికేషన్ జారీ చేశామని హరీశ్ తెలిపారు. 1.23లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. మరో 27వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో బ్రేక్ పడిందన్నారు. దీన్ని ఇటీవలే కేంద్రం పరిష్కరించిందని, త్వరలోనే పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్లే..
ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్ల మాదిరిగా హైదరాబాద్‌లోని స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హరీశ్ ప్రకటించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల తరహాలోనే ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ శాఖలతో కలిపి విద్యారంగానికి బడ్జెట్‌లో 12.45 శాతం నిధులు కేటాయించినట్లు తెలిపారు. స్కాలర్‌షి్‌పలకు నిధులు తగ్గించలేదని, ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్లే నిధులు తగ్గాయని పేర్కొన్నారు. దశల వారీగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు
0 Response to "త్వరలోనే పీఆర్సీ అమలు"
Post a Comment