ట్రంప్ భారత్ షెడ్యూల్ ఇదే

మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మొతేరా స్టేడియంలో ట్రంప్ ప్రసంగిస్తారు. మూడున్నర గంటలకు ఆగ్రాకు ట్రంప్ దంపతులు పయనమవుతారు.



సాయంత్రం 5 గంటల 10 నిముషాలకు తాజ్ మహల్ సందర్శిస్తారు. 6 గంటల 45 నిముషాలకు ఆగ్రా నుంచి ట్రంప్ బయలుదేరతారు. రాత్రి ఏడున్నర గంటలకు పాలెం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 8 గంటలకు తాము బస చేసే హోటల్ మౌర్యకు చేరుకుంటారు. దీంతో ట్రంప్‌ మొదటి రోజు టూర్‌ ముగుస్తుంది. రెండవ రోజు టూర్‌లో భాగంగా... ఫిబ్రవరి 25న ఉదయం తొమ్మిది గంటల 55 నిముషాలకు రాష్టపతి భవన్‌కు చేరుకుంటారు ట్రంప్. 10 గంటల 45 నిముషాలకు రాజ్‌ఘాట్‌లో మహాత్ముడి సమాధికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 11 గంటల 25 నిముషాలకు హైదరాబాద్ హౌస్‌కు ట్రంప్ దంపతులు చేరుకుంటారు. ఢిల్లీ ప్రభుత్వ స్కూల్ ను మెలానియా ట్రంప్ సందర్శిస్తారు.

ట్రంప్‌ భారత్‌ టూర్‌లో ఉమ్మడి మీడియా సమావేశం జరుగుతుంది. తర్వాత ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన లంచ్‌కు హాజరవుతారు ట్రంప్ దంపతులు. మధ్యాహ్నం రెండు గంటల 55 నిముషాలకు అమెరికా ఎంబసీకి ట్రంప్ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు అమెరికా ఎంబసీ సిబ్బందితో ట్రంప్ భేటీ అవుతారు. 4 గంటల 45 నిముషాలకు మౌర్యకు ట్రంప్ చేరుకుంటారు. రాత్రి 7 గంటల 25 నిముషాలకు రాష్ట్రపతి భవన్‌లో రామ్‌ నాథ్ కోవింద్‌తో ట్రంప్ భేటీ అవుతారు. 8 గంటలకు రాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరవుతారు ట్రంప్ దంపతులు. పది గంటలకు ఎయిర్‌ ఫోర్స్‌ విమానంలో తిరుగుపయనమౌతారు. భారత్ పర్యటనలో తన ప్రయాణానికి బీస్ట్ కాడిలాక్ కార్‌తో పాటు మెరైన్ వన్ హెలికాప్టర్ ఉపయోగిస్తారు ట్రంప్‌

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ట్రంప్ భారత్ షెడ్యూల్ ఇదే"

Post a Comment