షాకింగ్‌ : వంటగ్యాస్‌ ధరకు రెక్కలు

సాక్షి, న్యూఢిల్లీ : సబ్సిడీయేతర వంట గ్యాస్‌ ధర బుధవారం వరసగా ఆరోసారి ఎగబాకింది. మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచి అమల్లోకి 




రానున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు వరుసగా రూ 144.5, రూ 145 వరకూ పెంచినట్టు ఇండేన్‌ బ్రాండ్‌ నేమ్‌తో వంటగ్యాస్‌ను సరఫరా చేసే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. తాజా పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ 858, ముంబైలో రూ 829, చెన్నైలో రూ 881, కోల్‌కతాలో రూ 896కు పెరిగాయి. కాగా ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందచేస్తుండగా, అదనపు సిలిండర్‌ను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సిఇ ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ ధరలు, రూపాయి మారకం రేటు ఆధారంగా ప్రభుత్వం నెలవారీ సబ్సిడీలను వినియోగదారులకు అందిస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "షాకింగ్‌ : వంటగ్యాస్‌ ధరకు రెక్కలు"

Post a Comment