పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యాప్
ఆవిష్కరించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
రైతులకు ఈ పథకాన్ని మరింత చేరువ చేసేందుకే
దిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ యోజన) పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం దిల్లీలో ఆవిష్కరించారు. రైతులకు ఈ పథకాన్ని మరింత చేరువ చేసేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. దీని ద్వారా ఖాతాలో నగదు జమ వివరాలు, పేరు, చిరునామా మార్పులతో పాటు హెల్ప్‌లైన్ సేవలను పొందవచ్చని తెలిపారు
పూర్తిగా ఖర్చుకాని నిధులు
ఈనాడు,
దిల్లీ: రైతులకు ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాలేదు.
సోమవారం ఈ పథకం వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన
గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో దీని కింద అన్నదాతలకు ఇచ్చిన
మొత్తం రూ.42,044 కోట్లే. ఈ పథకానికి కేటాయించిన రూ.75,000 కోట్ల
బడ్జెట్‌లో రైతులకిచ్చింది కేవలం 56% మాత్రమే. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన
బడ్జెట్‌లో పొందుపరిచిన సవరించిన అంచనాల ప్రకారం... ఆర్థిక సంవత్సరం
అంతానికి రూ.54,370 కోట్లే ఖర్చయ్యే అవకాశాలున్నాయి. అంతిమంగా రూ.20,630
కోట్లు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సంతృప్తికర స్థాయిలో ఈ
పథకం కింద ప్రయోజనం అందుకుంటున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 22వ
స్థానం, తెలంగాణ 23వ స్థానంలో కొనసాగుతున్నాయి
0 Response to " పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యాప్ "
Post a Comment