ఏటీఎంల్లో మార్పులు.. ఆందోళన వద్దు'
దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల్లో మార్పు(రీకాలిబ్రేషన్)ల విషయమై వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎఫ్‌ఐఎస్ ఎండీ(బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఏపీఎంఈఏ) మహేశ్ రామమూర్తి ప్రకటించారు. ఈ చర్యల వల్ల వినియోగదారులకు ఏ విధమైన అసౌకర్యం కలగదని ఆయన హామీ ఇచ్చారు. ''రానున్న కొద్ది నెలల్లో భారత్‌లోని 2.4 లక్షల ఏటీఎంల రీకాలిబ్రేషన్ చేయాలని అనుకుంటున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా రూ.2,000 నోట్లు ఉంచే స్లాట్‌లను రూ.500లతో
మారుస్తున్నాం. బ్యాంకులకు, ఏటీఎం నిర్వహణ సంస్థలకు ఈ కార్యక్రమం భారీ కసరత్తు కానుంది. వినియోగదారుల సౌకర్యార్థం.. వారు ఏటీఎంల నుంచి ఎక్కువ సార్లు విత్‌డ్రా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది
అందువల్ల వినియోగదారులు ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకులతో సంప్రదింపుల అనంతరం మాత్రమే ఈ చర్యలు చేపడతాం. విత్‌డ్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రతిఫలాన్ని పొందే బ్యాంకులు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం పొందుతాయి. అందువల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆందోళన చెందనవసరం లేదు.'' అని ఆయన వివరించారు
Thanks for sharing, i write a blog on don'ts in academic writing do check it out.
ReplyDeleteHello. I'm Ahmed, a lifestyle and fashion product specialist from Pakistan with extensive experience in the industry. I’ve spent years working with top brands, with a particular focus on products like nike slides for men. My expertise lies in understanding market trends and helping consumers make informed style choices.
ReplyDelete