కొత్త, పాత విధానాల్లో పన్ను ఎంతో తెలుసుకోండి
కొత్త, పాత విధానాల్లో పన్ను ఎంతో తెలుసుకోండి
దిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుల్లో రెండు విధానాలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త, పాత విధానాల ద్వారా ఎంత పన్ను కట్టాలో సరిచూసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఈ-కాలిక్యులేటర్‌ను విడుదల చేసింది. ఈ కాలిక్యులేటర్ ద్వారా కొత్త విధానంలో ఎంత కట్టాలో.. పాత విధానమైతే ఎంత కట్టాలో చెల్లింపుదారులు పోల్చుకునేందుకు వీలుంటుంది.
పాత, కొత్త విధానాల ద్వారా పన్నులను సరిపోల్చుకునేందుకు టేబుల్‌తో కూడిన ఈ-కాలిక్యులేటర్‌ను ఐటీ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఐటీ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు
ఆదాయపు పన్ను శ్లాబులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేసింది. అయితే అదే సమయంలో పాత విధానమూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేగాక, కొత్త శ్లాబులను వాడుకుంటే ఎలాంటి మినహాయింపులు వర్తించబోవంటూ ఓ మెలిక కూడా పెట్టింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ప్రస్తుతం 100కు పైగా మినహాయింపులు ఉండగా.. కొత్త విధానంలో వీటిల్లో దాదాపు 70కి పైగా తొలగించినట్లు వెల్లడించింది. దీంతో ఏ విధానం మేలు చేస్తుందనేది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది
0 Response to "కొత్త, పాత విధానాల్లో పన్ను ఎంతో తెలుసుకోండి"
Post a Comment