కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83లక్షల ఖాళీలు

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83లక్షల ఖాళీలు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో 6.83 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం లోక్‌సభకు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 38,02,779 పోస్టులు ఉండగా.. 2018 మార్చి 1 నాటికి 31,18,956 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇంకా 6,83,823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

సిబ్బంది పదవీ విరమణ, రాజీనామాలు, మరణాలు, ప్రమోషన్లు తదితర కారణాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడినట్లు జితేంద్ర సింగ్‌ 





ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని, సదరు విభాగం లేదా మంత్రిత్వ శాఖ అవసరాన్ని బట్టి నియామకాలు జరుపుతున్నట్లు తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో యూపీఎస్పీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఏజెన్సీలు 1.34 లక్షల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ఎక్కువగా 1.16 లక్షల పోస్టులు రైల్వే బోర్డ్‌ ప్రతిపాదించినట్లు చెప్పారు. ఖాళీలపై సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్ని మంత్రిత్వశాఖలను కోరినట్లు తన సమాధానంలో పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83లక్షల ఖాళీలు"

Post a Comment