సంక్రాంతి సెలవులను కుదించిన ప్రభుత్వం

రెండో శనివారం పనిదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌: ఈనెల 11న రెండో శనివారం పాఠశాలలకు సెలవు ఉండదని విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 11న పనిదినంగా పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో దసరా సెలవులను ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెల రెండో శనివారం పనిచేయాలని గతంలో విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న పాఠశాలలు యథాతథంగా పనిచేస్తాయని పేర్కొంటూ విజయ్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు



ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి..

పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈనెల 11 నుంచి 16 వరకు ఆరు రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించారని.. అందుకు అనుగుణంగా ప్రయాణాలకు రిజర్వేషన్లు చేసుకున్నట్లు పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సంక్రాంతి సెలవులను కుదించిన ప్రభుత్వం"

Post a Comment