శాసన మండలి రద్దుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
అమరావతి: శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు. గతంలో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలను ఆధారంగా చేసుకొని మండలి రద్దుకు రాష్ట్ర కేబినెట్ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఉభయసభల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది.
శాసన, న్యాయపరంగా ఉన్న చిక్కులను పరిగణలోనికి తీసుకొని, తదుపరి ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయం బ్లాక్ 1లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైన కొద్దిసేపటికే మండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది
Additional information
తెలియచేసారు. దీనితో మరికాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మండలి రద్దుకు సంబంధించి బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింపచేసుకునే అవకాశం కనపడుతుంది. ఇక ఆ తరువాత కేంద్రానికి పంపించి మండలి రద్దు అంశాన్ని ఆమోదించవలసిందిగా కోరే అవకాశం ఉంది
0 Response to "శాసన మండలి రద్దుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం"
Post a Comment