బదిలీలు ఉన్నట్లా... లేనట్లా?
ప్రజాశక్తి -టెక్కలి
ఉపాధ్యాయుల బదిలీలపై నీలినీడలు
అలముకుంటున్నాయి. జనవరి నెల సంక్రాంతి సెలవుల్లో
బదిలీలు చేస్తామని విద్యాశాఖ చేసిన ప్రకటన అమల్లోకి
రాకపోవడంపై ప్రభుత్వ విద్యాశాఖ తీరుపై ఉపాధ్యాయులు
అసహనాన్ని. వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా
ఉపాధ్యాయులకు నిర్వహించాల్సిన బదిలీలు మూడేళ్లుగా
లేకపోవడంతో దీర్జకాలంగా పాఠశాలల్లో విధులు
నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు బదిలీల కోసం
ఎదురుచూస్తున్నారు. గడిచిన వేసవి సెలవుల్లో
ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని ఆశించినప్పటికీ
నూతన ప్రభుత్వం ఏర్పడడంతో వేసవి సెలవుల్లో బదిలీలు
జరగలేదు. అయితే సాధారణ బదిలీలకు అవకాశం ఇచ్చిన
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు కూడా గ్రీన్‌సిగ్నల్
అప్పట్లో ఇవ్వలేదు. జనవరి నెలలో ఎన్నికల హడావుడిలో
ప్రభుత్వం ఉండడం, దీనికితోడు వేసవి సెలవుల్లో జనాభా
లెక్కల సేకరణ వంటి ప్రభుత్వ పనులు ఉండడంతో
అప్పట్లో ఉపా ల బదిలీలు ఉండవని అందరూ
భావించారు. ఇటువంటి నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు
ఒకడుగు ముందుకేసి సంక్రాంతి సెలవుల్లో ఉపాధ్యాయుల
బదిలీలు చేపడతామని ప్రకటించారు. అయితే నేటి వరకూ
+ సందిద్ధంలో ఉపాధ్యాయులు
+ బదిలీల కోసం ఎదురుచూపులు
+ విద్యాశాఖ తీరుపై అసహనం
బదిలీల ప్రస్తావన లేకపోవడంతో సెలవుల్లో ఉపాధ్యాయుల
బదిలీలు ఉంటాయా... ఉండవా? అన్నది సంశయంగా
మారుతుంది.
ఇప్పటికే బదిలీల కోసం కొన్నేళ్లుగా
ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు మాత్రం తీవ్ర
ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిఏటా ప్రభుత్వం
ఉపాధ్యాయుల్లో బదిలీ ఆశలు కల్పించి చివరికి
ఉసూరుమనిపిస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు
బదిలీలు జరగకపోతే ఈ ఏడాదికి మరి జరగవు అనే
సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా
ముందుగా విద్యాశాఖ ప్రకటించిన మేరకు సంక్రాంతి
సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలుంటే ఇప్పటికే షెడ్యూల్
ప్రకటించాల్సి ఉంది. ఈ నెల పదో తేదీ నుంచి ప్రభుత్వ
పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ
నేపథ్యంలో ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి
వరకూ బదిలీలకు సంబంధించి ఎటువంటి మార్గదర్శ కాలు
జారీ కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. సంక్రాంతి సెలవులకు ఉపాధ్యాయుల
బదిలీలుంటాయని భావించి చాలామంది ఉపాధ్యాయులు
ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాజాలను వాయిదా
వేసుకున్నారు.
బదిలీలు జరిగితే తాము సానికంగా
ఉండాలనే నిబంధన ఉండడంతో వారు ఎక్కడికీ వెళ్లలేని
పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా విద్యాశాఖ ఇటీవల
చాలామంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించింది.
దీనివల్ల ఉద్యోగోన్న న్నతి పొందిన ఉపాధ్యాయులకు 'అడ్‌హక్
పద్ధతిలో నియామకాలు చేపట్లి ఖాళీలను భర్తీ చేశారు.
బదిలీలు జరిగితే ఈ అడ్‌హక్ స్థానంలో ఉన్నవారు తమ
స్థానాన్ని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి
ఏర్పడుతుంది. ఇటువంటి తరుణంలో ఉద్యోగోన్నతి పొంది
స్థానికంగా ఉండిపోయిన ఉపాధ్యాయులకు కొంతవరకూ
లాభమైనప్పటికీ సినియర్ ఉపాధ్యాయులకు మాత్రం నష్టం
ఏర్పడుతుంది. అందువల్ల ఉపాధ్యాయుల బదిలీలు
తప్పనిసరి అయినప్పటికీ విద్యాశాఖ వాటివైపు
దృష్టిసారించకపోవడం పై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.
0 Response to "బదిలీలు ఉన్నట్లా... లేనట్లా?"
Post a Comment