అబార్షన్‌ గడువు పెంపు



  • 24 వారాలకు పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ, జనవరి 29: గర్భవిచ్ఛిత్తి (అబార్షన్‌)పై కేంద్ర ప్రభుత్వం కీలక

నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అబార్షన్‌ చేయించుకునేందుకు 20 వారాలుగా ఉన్న గడువును ‘ప్రత్యేక విభాగం మహిళల’కు 24 వారాలకు పెంచింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. అత్యాచార బాధితులు, మైనర్లు, వైకల్యం కలిగిన మహిళలకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. అబార్షన్‌ చేసేందుకు గరిష్ఠ పరిమితిని 24 వారాలకు పెంచుతూ 1971 నాటి చట్టానికి సవరణ 


చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ బిల్లును పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఎవరికైనా 20 వారాల్లో గర్భం తొలగించాల్సి వస్తే ఒక వైద్యుడి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ, ఇప్పుడు ఇద్దరు వైద్యుల అభిప్రాయం కావాలని.. వారిలో ఒకరు కచ్చితంగా ప్రభుత్వ వైద్యుడై ఉండాలని జావడేకర్‌ స్పష్టం చేశారు. అలాగే హోమియోపతి, భారత ఔషధ వ్యవస్థలకు జాతీయ కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన సవరణ బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని జావడేకర్‌ 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " అబార్షన్‌ గడువు పెంపు"

Post a Comment