యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం
శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) యువ శాస్త్రవేత్తల కార్యక్రమంలో విద్యార్థులకు రెండు వారాల శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను ఫిబ్రవరి 3 నుంచి 24లోగా పంపాలి. ఇందుకు 2019-20లో విద్యా సంవత్సరంలో 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 9వ తరగతిలో ప్రవేశం పొందేలా ఉండాలి. మే 11 నుంచి 22 వరకు రెండు వారాలపాటు శిక్షణ ఇస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి సీబీఎస్‌ఈ, రాష్ట్ర సిలబస్ చదివిన ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలను ఇస్రో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు
0 Response to "యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం"
Post a Comment