అమ్మఒడికి నేడు సీఎం జగన్‌ శ్రీకారం


  • మొదటిసారి సీఎం హోదాలో చిత్తూరుకు జగన్‌
  • రూ.కోట్ల ఖర్చుతో నగరమంతా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు
చిత్తూరు(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరులో గురువారం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేటి నుంచి రూ.15 వేలు జమ కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికార యంత్రాంగం గత వారం రోజులుగా భారీ ఏర్పాట్లు చేసింది. జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యక్రమం విజయవంతం కావడానికి శతవిధాలా కృషి చేస్తున్నారు. వీరితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తిరుపతిలో, డిప్యూటి సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి చిత్తూరులో ఏర్పాట్ల గురించి, కార్యక్రమ విజయవంతం గురించి సమావేశాలు నిర్వహించారు. సీఎం సలహాదారు తలసీల రఘురాం గత వారం రోజులుగా చిత్తూరులోనే ఉంటూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా బుధవారం విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ కూడా చిత్తూరుకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 
కలెక్టర్‌ భరత్‌గుప్తా అమ్మఒడి పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా ముగించేందుకు రాత్రింబవళ్లు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అమ్మఒడి పథకం విద్యాశాఖకు సంబంధించినది కావడంతో డీఈవో నరసింహారెడ్డితో పాటు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి కూడా నిత్యం చిత్తూరులోనే ఉంటూ శాఖ తరఫున నిర్వహించాల్సిన పనులను చూసుకుంటున్నారు.


 
30 వేల మందితో మానవహారం
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చిత్తూరులో పెద్దఎత్తున మానవహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు మున్సిపాలిటీతో పాటు, చిత్తూరు, గుడిపాల మండలాల నుంచి డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు 20 వేల మంది, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి 10 వేల మంది.. మొత్తం 30 వేల మందితో నగరంలో మానవహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జడ్పీ సీఈవో కోదండరామిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేశు, మెప్మా పీడీ జ్యోతి ఈ బాధ్యతలు తీసుకున్నారు. సీఎం వేదిక మీదకు వచ్చేంతవరకు 15 బృందాలతో 


సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజనం, ఇంగ్లీషు మీడియం ప్రాముఖ్యతలు తెలిపే స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణాన్ని ప్రత్యేకంగా వైసీపీ జెండా రంగులతో అలంకరించారు. ఊరంతా ప్రధాన మార్గాలను భారీ కటౌట్లతో 


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " అమ్మఒడికి నేడు సీఎం జగన్‌ శ్రీకారం"

Post a Comment