గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ రేపటిలోపు వేతనాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మండల పరిషత్ అధికారులు ఉద్యోగుల వివరాలు సేకరించి వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 




అక్టోబర్ నెల 2వ తేదీన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారు విధుల్లో చేరారు. విధుల్లో చేరి రెండు నెలలైనా వేతనాలు అందకపోవటంతో వేతనాల కోసం ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రేపటిలోగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు వేతనాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుస్తుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త"

Post a Comment