అబ్బా... బోర్ కొడుతోంది.
పిల్లల పెంపకంలో కౌమారదశ చాలా కీలకమైనది. పైగా ఎనిమిదో తరగతి దాటిన దగ్గర్నుంచి చాలామంది పిల్లలు బోర్ అనడం వింటుంటాం. అయితే ఇలా బోర్‌గా ఫీలవడం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే ఎక్కువని వాషింగ్టన్ స్టేట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు.
అయితే వాళ్లు తరచూ అలా అంటుంటే దాన్ని అంత తేలికగా తీసుకోకూడదనీ, దాన్ని పొగొట్టే ప్రయత్నం చేయాలనీ లేదంటే అది కాస్తా డిప్రెషన్‌కు దారితీసే అవకాశం ఉందనీ చెబుతున్నారు. పైగా వాళ్లు ఆ వయసులో బోర్‌గా ఫీలవుతున్నారంటే వాళ్లు తమ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదనీ ఏదో అసంతృప్తితో జీవిస్తున్నారనీ అర్థం చేసుకోవాలి
బాల్యం నుంచి పెద్దవాళ్లుగా మారే దశే కౌమారం. కాబట్టి వాళ్లు ఆ సమయంలో తమకు తామే పెద్దవాళ్లమైపోయామన్న భావనతో విపరీతమైన స్వేచ్ఛని కోరుకుంటుంటారు. అందుకే వీలయినంత ఎక్కువ సమయం వాళ్లతో గడుపుతూ చదువూ ఆటల్లో పూర్తిగా నిమగ్నమయ్యేలా చూడాల్సిన బాధ్యత పెద్దవాళ్లదేననీ
0 Response to "అబ్బా... బోర్ కొడుతోంది."
Post a Comment