విద్యా రంగానికి మదన్ మోహన్ మాలవీయ సేవలు అమూల్యం : మోదీ
న్యూఢిల్లీ :
‘భారత రత్న’ మదన్ మోహన్ మాలవీయ విద్యా రంగానికి చేసిన సేవలు అమూల్యమైనవని
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాలవీయ 158వ జయంతి సందర్భంగా ఆయనకు
మోదీ నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం కూడా ఆయన విశేష కృషి
చేశారన్నారు.
బుధవారం మోదీ ట్విటర్ వేదికగా పండిట్ మదన్ మోహన్ మాలవీయకు నివాళులర్పించారు.
‘‘పండిట్ మదన్ మోహన్ మాలవీయ
జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. దేశ సేవ కోసం ఆయన తన జీవితాన్ని అంకితం
చేశారు. విద్యా రంగంలో అమూల్యమైన సేవలు అందించడంతోపాటు ఆయన భారత దేశ
స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన
మేధాశక్తి, ఆదర్శాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రేరణను ఇస్తాయి’’ అని మోదీ
పేర్కొన్నారు.
పండిట్ మదన్ మోహన్
మాలవీయ 1861 డిసెంబరు 25న ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు.
స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించడంతోపాటు, బనారస్ హిందూ
యూనివర్సిటీని 1916లో స్థాపించారు.
‘భారత
రత్న’ మాలవీయ 1946 నవంబరు 12న దివంగతులయ్యారు. అప్పటికి ఆయన వయసు 84
సంవత్సరాలు. 2014లో ఆయనకు ‘భారత రత్న’ పురస్కారాన్ని భారత ప్రభుత్వం
0 Response to " విద్యా రంగానికి మదన్ మోహన్ మాలవీయ సేవలు అమూల్యం : మోదీ "
Post a Comment