విద్యుత్ ఉద్యోగుల విభజనపై నిర్ణయం
హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు చర్చించిన కమిటీ మొత్తం 1157 మంది ఏపీ ఉద్యోగుల్లో 613 మందిని ఏపీకే కేటాయించింది.
ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 256 మంది ఉద్యోగుల్లో 50 శాతం మందిని తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కేటాయింపులను ఏపీ విద్యుత్ ఉద్యోగులు అంగీకరించడం లేదు. తుది నివేదిక ఆధారంగానే కేటాయింపులు చేశామని, నివేదికను కోర్టుకు అందజేస్తామని ధర్మాధికారి కమిటీ
స్పష్టంచేసింది
0 Response to "విద్యుత్ ఉద్యోగుల విభజనపై నిర్ణయం"
Post a Comment